ICC T20I rankings: మనోడే నెంబర్ 1: టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న అభిషేక్ శర్మ

ICC T20I rankings: మనోడే నెంబర్ 1: టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న అభిషేక్ శర్మ

టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ స్థానంలో నిలిచాడు. బుధవారం (జూలై 30) ఐసీసీ రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. టీ20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ తర్వాత నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న మూడో ఇండియన్ గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఖాతాలో 829 రేటింగ్ పాయింట్లు ఉండగా.. 814 పాయింట్లతో హెడ్ రెండో స్థానానికి పడిపోయాడు. ఇటీవలే జరిగిన వెస్టిండీస్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో హెడ్ ఆడకపోవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

Also Read:-లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టులో చేరిన మాజీ టీమిండియా బౌలింగ్ కోచ్

2024 లో జింబాబ్వేపై తన కెరీర్ లో తొలి టీ20 సెంచరీ చేసి సత్తా చాటిన అభిషేక్.. నిలకడతో పాటు వేగంగా రాణిస్తూ భారత జట్టులో చోటు పదిలం చేసుకున్నాడు. 2025 లో ఇంగ్లాండ్ పై జరిగిన ఐదో టీ20లో 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 2024 టీ20 వరల్డ్ కప్ సమయంలో సూర్యను అధిగమించి టాప్ కు చేరుకున్న హెడ్.. ఏడాది తర్వాత టీ 20 ఫార్మాట్ లో తన నెంబర్ వన్ ర్యాంక్ ను అభిషేక్ శర్మకు కోల్పోవాల్సి వచ్చింది. టీమిండియా బ్యాటర్లల్లో తిలక్ వర్మ మూడో స్థానంలో.. కెప్టెన్ సూర్యకుమార్ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్- 10 లో ఉన్న జైశ్వాల్ రెండు స్థానాలు కోల్పోయి 11 వ స్థానానికి పడిపోయాడు. 

ఇంగ్లాండ్ ఓపెనర్లు సాల్ట్, బట్లర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డాఫి అగ్ర స్థానంలో ఉన్నాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడో స్థానంలో.. అర్షదీప్ సింగ్ పదో స్థానంలో కొనసాగుతున్నారు. టీమ్స్ విషయానికి వస్తే ఇండియా టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉంది. ఆల్ రౌండర్ విభాగంలో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్య అగ్ర స్థానంలోనే ఉన్నాడు.