IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టులో చేరిన మాజీ టీమిండియా బౌలింగ్ కోచ్

IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టులో చేరిన మాజీ టీమిండియా బౌలింగ్ కోచ్

టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరనున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ భరత్ అరుణ్‌ను తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. 62 ఏళ్ళ భరత్ లక్నోతో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. భరత్ అరుణ్ కు ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు బౌలింగ్ కోచ్‌గా నాలుగు సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉంది. 2024 ఎడిషన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ టైటిల్ గెలిచిన జట్టుకు బౌలింగ్ కోచ్ గా పని చేశాడు. 

అరుణ్ లక్నోకు రావడంతో ఇప్పుడు  జహీర్ ఖాన్ పాత్రపై కొంత సస్పెన్స్ ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ లో జహీర్ ఖాన్ లక్నో జట్టుకు   మెంటార్ తో పాటు బౌలింగ్ కోచ్‌గాను పని చేశాడు. భరత్ రాకతో ఇప్పుడు జహీర్ మెంటార్‌గా మాత్రమే కొనసాగుతాడా లేదా ఫ్రాంచైజీ అతన్ని రిలీజ్ చేస్తుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. భరత్ అరుణ్ లక్నోలో చేరడం కేకేఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మంగళవారం (జూలై 29)  కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్‌ చంద్రకాంత్ పండిట్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఒక రోజులోనే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ లక్నోలో చేరడం గమనార్హం. 

Also read:- ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్.. గవాస్కర్ మూడు రికార్డ్స్‌ను టార్గెట్ చేసిన గిల్

టీమిండియాకు వరల్డ్ క్లాస్ బౌలింగ్ ను తయారు చేయడంలో భరత్ అరుణ్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఐపీఎల్ లోనూ కేకేఆర్ జట్టుకు విజయవంతమైన బౌలింగ్ కోచ్ గా పేరు తెచ్చుకున్నాడు. అతని అనుభవం లక్నో జట్టుకు పని వస్తోందని ఫ్రాంచైజీ ఆశలు పెట్టుకుంది. భరత్ అరుణ్ మొదట చెన్నై జట్టులో చేరదామని భావించినా చివరి నిమిషంలో చెన్నై సూపర్ కింగ్స్ ను వదిలి లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరినట్టు సమాచారం. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ కు చేరడంలో విఫలమైంది.