జేఈఈ అడ్వాన్స్డ్లో గురుకుల విద్యార్థుల సత్తా

 జేఈఈ అడ్వాన్స్డ్లో గురుకుల విద్యార్థుల సత్తా
  •  49 మంది పరీక్ష రాయగా ఆరుగురికి ర్యాంకులు

హైదరాబాద్, వెలుగు: ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో బీసీ  గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ముగ్గురు అమ్మాయిలు బి. నిఖిత(267), ఆర్ పల్లవి (306), ఎస్ . నందిని (768), ముగ్గురు అబ్బాయిలు కె. అఖిల్ (1667), ఎ. జగదీశ్(2360), ఎం. శివకుమార్ (4790) ర్యాంకులు సాధించినట్టు బీసీ గురుకుల సెక్రటరీ సైదులు ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. 

49 మంది అడ్వాన్స్ డ్ పరీక్ష రాయగా వారిలో 21 మంది అబ్బాయిలు, 28 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో మొత్తం ఆరుగురు విద్యార్థులు ర్యాంక్ లు సాధించి ఉన్నత విద్య అభ్యసించడానికి  అర్హత సాధించారని చెప్పారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు, అధ్యాపక సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు అభినందించారు.