సర్కార్ దొంగ లెక్కలు..40 వేల కుటుంబాలకు సాయం డౌటే!

సర్కార్ దొంగ లెక్కలు..40 వేల కుటుంబాలకు సాయం డౌటే!

కరోనా మరణాల విషయంలో రాష్ట్ర సర్కార్ దొంగ లెక్కల వల్ల సుమారు 40 వేల కుటుంబాలు పరిహారానికి దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. కరోనా మరణాలన్నింటినీ ప్రభుత్వం నార్మల్ డెత్స్ గానే చూపించింది. డెత్ సర్టిఫికెట్లలో కాజ్ ఆఫ్ డెత్ కింద కరోనాకు బదులు ఇతర జబ్బులను చేర్చింది. దీంతో కేంద్రం ప్రకటించిన పరిహారం అందుతుందో ,లేదోనని కరనా మృతుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కరోనా మృతుల కుటుంబాలకు రూ..50 వేల చొప్పున పరిహారం ఇవ్వా్సిందేనని కేంద్ర ప్రబుత్వం నిర్ణయించింది. స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్  ఫండ్స్ నుంచి పరిహారం చెల్లించేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతిచ్చింది. త్వరలో దరఖాస్తులు మొదలయ్యాయి. దరఖాస్తుతో పాటు కోవిడ్ తో చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర సర్కారు లెక్కులు చెబుతున్నాయి. ములుగు జిల్లాలో అత్యల్పంగా ఏడుగురు ,హైదరాబాద్ లో అత్యధికంగా 1698 మంది చనిపోయినట్లు చూపించారు. అసలు సంఖ్య కనీసం పదింతల కంటే ఎక్కువే ఉంటుందని హెల్త్  ఆఫీసర్లే చెబుతున్నారు.
 గ్రేటర్ లో కరోనాకు ముందు 2017 నుంచి 2019దాకా ఏటా సగటున 55,971 మరణాలు నమోదవ్వగా 2020లో 76,375 కు పెరిగాయి ఈ ఏడాది జూన్ నాటికే గ్రేటర్ లో 47,472 మరణాలు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రంలో  2017 నుంచి 2019 దాకా ఏటా సగటున 45,216 మరనాలు నమోదైతే  2020లో రాష్ట్రంలో 79,272కు పెరిగాయి. ఈ ఏడాది జూన్ నాటికే 57,841 మరణాలు నమోదయ్యాయి. మార్చి మూడో వారం నుంచి జూలై రెండో వారం దాకా రోజూ వందల్లో మరణాలు చోటుచేసుకున్నాయి.ఇప్పటికీ రోజూ 5 నుంచి మరణాలు నమోదవుతున్నాయి.కానీ ఒకరిద్దరు చనిపోయినట్లు బులెటిన్ లో చూపిస్తున్నారు. దంతో మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.