టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. స్పిన్ ఆల్ రౌండర్ గా జట్టులో కొనసాగుతున్న జడేజా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతున్నాడు. ఒకప్పుడు జడేజా జట్టులో ఉంటే బ్యాటింగ్, బౌలింగ్ లో సమతుల్యత వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. జడేజా తుది జట్టులో ఉన్నా రెందు విభాగాల్లో విఫలమవుతున్నాడు. వన్డే ఫార్మాట్ లో స్వదేశంలో జడేజా హాఫ్ సెంచరీ చేయక ఏకంగా 13 ఏళ్లు దాటింది. 2023 ప్రపంచ కప్ తర్వాత రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ఒక్కసారిగా దిగజారింది. వరల్డ్ కప్ తర్వాత 13 మ్యాచ్‌ల్లో 29.8 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్ లో 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ప్రస్తుతం జడేజా వన్డే, టెస్ట్ ఫార్మాట్ లో ఆడుతున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలుచుకున్న తర్వాత ఈ స్టార్ ఆల్ రౌండర్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో సూపర్ ఫామ్ లో ఉన్న జడేజా వన్డేల్లో రాణించలేకపోతున్నాడు. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించని ఈ స్టార్ ఆల్ రౌండర్ ఆ తర్వాత 2025లో ఆస్ట్రేలియా సిరీస్ లో చోటు దక్కలేదు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో జడేజాకు చోటు దక్కినా.. ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు.
తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ జడేజా ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమయ్యాడు. మూడు మ్యాచ్ ల్లో జడేజా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో జడేజా వన్డే కెరీర్ ముగింపు దశకు వచ్చేలా కనిపిస్తోంది.
2027 వన్దే వరల్డ్ కప్ ముందు జడేజాను తప్పించి సుందర్, అక్షర్ కు ఎక్కువగా ఛాన్స్ లు ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక జడేజా టెస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది.
అనుభవజ్ఞుడైన జడేజా 210 మ్యాచ్‌ల్లో 232 వికెట్లు పడగొట్టాడు. 2,905 పరుగులు చేసి బ్యాట్ తోనూ సత్తా చాటాడు. 2024 టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచిన తర్వాత జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. వన్డేల్లో తన స్థానం ఖరారనుకుంటే జడేజా పేలవ ఫామ్ తో జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. త్వరగా కుదురుకుని జడేజా ఫామ్ లోకి వస్తాడా లేకపోతే చెత్త ఫామ్ తో వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెబుతాడా అనేది చూడాలి.
Your thoughts on Ravindra Jadeja in the ODI set-up? pic.twitter.com/3BYGLITXqp
— Cricbuzz (@cricbuzz) January 19, 2026
