జూన్ 26న స్కూళ్లు బంద్: ఏబీవీపీ

జూన్ 26న స్కూళ్లు బంద్: ఏబీవీపీ

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు బడుల్లో ఫీజులను నియంత్రించాలని, సర్కారు బడుల్లో వసతులు కల్పించాలని కోరుతూ జూన్ 26 రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్​కు పిలుపునిస్తున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ఒక ప్రకటనలో తెలిపారు. 

సర్కారు బడుల్లోని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాల దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కార్పొరేట్ స్కూళ్లలో రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా, ఆయా మేనేజ్​మెంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకొస్తామని అనేక హామీలు ఇచ్చినా, ఇప్పటికీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 26న జరిగే స్కూళ్ల బంద్​కు మేనేజ్ మెంట్లు సహకరించాలని కోరారు.