ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

శంషాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్​మెంట్​బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ డిమాండ్​చేశారు. మంగళవారం శంషాబాద్ లో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్ బకాయిలు పెండింగ్ ఉన్నాయన్నారు.

 కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. శంషాబాద్ విభాగ్ కన్వీనర్ కల్లెం సూర్యప్రకాశ్, జిల్లా కన్వీనర్ చందు, ఎస్ఎఫ్ డీ కోకన్వీనర్ ప్రదీప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చరణ్, సిటీ జాయింట్ సెక్రటరీ పవన్ తదితరులున్నారు.