రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలి

రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలి

ఎల్​బీనగర్, వెలుగు: రెండేళ్లుగా పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు శుక్రవారం దిల్​సుఖ్ ​నగర్​లో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

అనంతరం ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మహేశ్​మాట్లాడుతూ.. రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్​లు రిలీజ్ చేయకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో స్టూడెంట్ లీడర్స్ హనుమాన్, వినయ్ పాల్గొన్నారు.