అవినాష్ ​కాలేజీ ముందు ఏబీవీపీ లీడర్ల ఆందోళన

అవినాష్ ​కాలేజీ ముందు ఏబీవీపీ లీడర్ల ఆందోళన

బషీర్ బాగ్, వెలుగు: ఇంటర్ స్టూడెంట్లకు వేసవి సెలవులు ఇవ్వకుండా, క్లాసులు నిర్వహిస్తున్నారంటూ ఏబీవీపీ నాయకులు శుక్రవారం సుల్తాన్ బజార్ లోని అవినాష్ కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

కాలేజీ గేట్లు క్లోజ్​చేసి, తాళాలు వేయడంతో ఏబీవీపీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ హరిప్రసాద్, నాయకులు అక్కడే బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు విద్యార్థి నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. క్లాసులు బంద్​చేయించి, పిల్లలను ఇంటికి పంపించి వేయాలని డిమాండ్, పోలీసులు కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు. స్టూడెంట్లను పంపించివేశారు. దీంతో ఏబీవీపీ నాయకులు ఆందోళన విరమించారు.