SSMB29: ‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్‌‌కు రంగం సిద్ధం.. సర్‌ప్రైజ్‌లతో ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వనున్న మహేష్, రాజమౌళి

SSMB29: ‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్‌‌కు రంగం సిద్ధం.. సర్‌ప్రైజ్‌లతో ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వనున్న మహేష్, రాజమౌళి

దర్శకధీరుడు SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘SSMB29’ (వర్కింగ్ టైటిల్: 'గ్లోబ్ ట్రాటర్'). భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ కోసం వరల్డ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇక ఆ తరుణం రానే వచ్చింది. ఇవాళ శనివారం (2025 నవంబర్ 15న) ‘గ్లోబ్‌ట్రాటర్‌’ పేరుతో మెగా ఈవెంట్‌‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో.. ‘SSMB29’ మూవీ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ జియో సినిమా/హాట్‌స్టార్‌లో సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇప్పటివరకు 'SSMB29' నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి? ఇవాళ ఎలాంటి కొత్త అప్డేట్స్ రానున్నాయి అనేది ఓ లుక్కేద్దాం.

SSMB 29 సర్‌ప్రైజ్‌ ఇవే:

  • SSMB 29 టైటిల్‌ ప్రకటన
  • SSMB 29 జానర్‌ కథ
  • SSMB 29 ప్రపంచాన్ని పరిచయం చేసే గ్లింప్స్ 
  • SSMB 29 మహేష్ బాబు క్యారెక్టర్ పేరు, ఫస్ట్ లుక్‌
  • SSMB 29 ఈవెంట్‌లో ఏర్పాటు చేసిన 130 అడుగుల స్క్రీన్‌ ప్రదర్శన 

ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్:

  • ‘కుంభ’గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌
  • ‘మందాకిని’గా ప్రియాంక చోప్రా
  • ‘సంచారీ’ SSMB 29 ప్రపంచాన్ని పరిచయ గీతం

విలన్‌గా పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ సంచలనం..

సడెన్ సర్‌ప్రైజ్‌లలో భాగంగా, ఇటీవల సినిమాలోని విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను రాజమౌళి విడుదల చేశారు. 'కుంభ' అనే క్రూరమైన, శక్తివంతమైన విలన్ పాత్రలో పృథ్వీరాజ్ కనిపించనున్నారు. వీల్ చైర్‌లో, రోబోటిక్ చేతులతో ఉన్న ఆ మెకానికల్ లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 'డాక్టర్ ఆక్టోపస్' లాంటి కామిక్ బుక్ విలన్‌ను గుర్తుకుతెచ్చే ఈ పాత్ర... విభిన్నమైన విలనిజం చూపిస్తుందని రాజమౌళి వెల్లడించారు.

శ్రుతి హాసన్ గళంలో 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్..

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన 'గ్లోబ్ ట్రాటర్' అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. దీనిని ప్రముఖ నటి, గాయని శ్రుతి హాసన్ ఆలపించి అందరిని ఆశ్చర్యపరిచింది.. 'సంచారి.. సంచారి' అంటూ సాగే ఈ పాట లిరిక్స్, మహేష్ బాబు పోషించనున్న గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచరర్ పాత్ర స్వభావాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్నాయి.

మందాకినిగా ప్రియాంక చోప్రా.. 

మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌లో ప్రియాంక చీరకట్టులో గన్‌ పేలుస్తూ యాక్షన్‌ మోడ్‌లో దర్శనమిచ్చింది. అటు అందం.. ఇటు ఫైర్‌ కలగలిసిన స్టిల్‌ అలరిస్తోంది. ‘‘ప్రపంచ వేదికపై ఇండియన్‌ సినిమాను పునర్నిర్వచించిన మహిళ. దేశీ గర్ల్‌ మళ్లీ వచ్చేసింది. ‘మందాకిని’ డిఫెరెంట్ షేడ్స్ చూడటానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది’’ అని X వేదికగా రాజమౌళి పోస్ట్‌ పెట్టారు.