రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి

రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి
  • కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆందోళన

సంగారెడ్డి టౌన్, వెలుగు: పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందన్నారు. విద్యార్థులకు రావల్సిన ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​చేశారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మహేశ్, మల్లేశ్, ఉదయ్ సాగర్, శ్రీనివాస్, వినయ్ పాల్గొన్నారు.

మంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన ఏబీవీపీ 

హుస్నాబాద్: పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా రెండేళ్లుగా స్కాలర్ షిప్​లు విడుదల కావడం లేదన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 

వెంటనే బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులను, ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాకేశ్, చరణ్, పరశురాం, జశ్వంత్, రాజేశ్, రాజు, అంజి పాల్గొన్నారు. మంత్రి క్యాంపు ఆఫీసు ముట్టడి చేసిన 13 మంది ఏబీవీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.