ఉద్రిక్తతంగా మారిన ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడి

ఉద్రిక్తతంగా మారిన ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడి

ఏబీవీపీ విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తత రేపింది. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని సభ వెలుపలే పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు నినాదాలు చేయడంతో పాటు.. వెంటనే వర్శిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని సర్కారు నాశనం చేసిందని విమర్శించారు. ఇందులో భాగంగానే విద్యార్థులు అసెంబ్లీలోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో.. పోలీసులు పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్లు మూసివేశారు. విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు తీవ్రంగా నిరసన తెలపడంతో.. అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి విద్యార్థులను అరెస్ట్ చేశారు. లాఠీ చార్జ్ లో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.