- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్
లక్సెట్టిపేట, వెలుగు: గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం, సంక్రాంతి పండగను పురస్కరించుకుని రఘునాథ్ వేరబల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్సెట్టిపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో మంచిర్యాల కబడ్డీ ప్రీమియర్ లీగ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లా డుతూ.. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఆయన ఆశయ సాధనకు పాటుపడాలన్నారు. కబడ్డీ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజుల ముఖేశ్ గౌడ్, వీరమల్ల హరిగోపాల్, గుండా ప్రభాకర్, రమేశ్ చంద్, వేముల మధు, తులసి వెంకటేశ్, సతీశ్, నరేశ్ చంద్, గంగన్న, రాజేందర్, సమరసింహ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
