కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు మొదటిసారి ఈ నెల 13న కరీంనగర్ రానున్నారు. అలుగునూరు చౌరస్తా వద్ద ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ లీడర్లకు ఆయనకు స్వాగతం పలికి భారీ ర్యాలీగా గీత భవన్ చౌరస్తా వద్దకు చేరుకుంటారు.
అక్కడ జరిగే సంబురాల్లో పాల్గొంటారు. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొననున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా వెలిచాల నియామకంపై మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. 63వ డివిజన్ జ్యోతి నగర్ లోని కురుమ వాడలో కాంగ్రెస్ నాయకుడు ఇరుమల్ల మల్లేశం ఆధ్వర్యంలో మిఠాయిలు పంచారు.
