మంథని, వెలుగు: కాంగ్రెస్ పాలనలోనే క్రీడల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జి, జాతీయ యూత్ సెక్రటరీ రోషిణి జైశ్వాల్ పేర్కొన్నారు. ఆదివారం మంథని పట్టణం జూనియర్ కాలేజీ మైదానంలో క్రికెట్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే క్రీడల అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
రాష్ట్రాన్ని క్రీడల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారన్నారు. అంతకుముందు మంత్రి క్యాంపు ఆఫీస్‌లో యూత్ కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించారు. యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, స్టేట్ జనరల్ సెక్రటరీ మధు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అవినాశ్, ఇన్‌చార్జి వెంకటేశ్, బండ కిశోర్ రెడ్డి, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
