ముత్తారం, వెలుగు: ముత్తారంలో ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆర్యవైశ్య సంఘం నాయకులు కోరారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మండల అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
అంతకుముందు మంత్రి మంథనిలోని పెంజేరు కట్ట హనుమాన్ దేవాలయంలో, శ్రీ మహాగణపతి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగణపతి, ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.
