- బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: బీసీలపై కొనసాగుతున్న అఘాయిత్యాలను నివారించడానికి ఏపీ ప్రభుత్వం బీసీ అట్రాసిటీ బిల్లు తెచ్చినట్టుగానే తెలంగాణ సర్కారు కూడా ఆ దిశగా అడుగులు వేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ విజ్ఞప్తి చేశారు. 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడానికి ప్రభుత్వ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధాని దగ్గరకు తీసుకువెళ్లాలని కోరారు. రాజ్యాంగ సవరణ జరగడానికి అవసరమైన ప్రైవేటు బిల్లును కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో ప్రవేశపెట్టే విధంగా సీఎం చొరవ తీసుకోవాలన్నారు. పార్లమెంటులో బీసీ ఎంపీలతో కూడిన పార్లమెంటరీ కమిటీ మాదిరిగా, తెలంగాణ అసెంబ్లీలో బీసీ ప్రజా ప్రతినిధుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
