డిసెంబర్ 7 నుంచి ఏబీవీపీ జాతీయ మహాసభలు

డిసెంబర్ 7 నుంచి ఏబీవీపీ జాతీయ మహాసభలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 7 నుంచి10వ తేదీ వరకు ఢిల్లీలో 69వ ఏబీవీపీ జాతీయ మహాసభలు జరగనున్నాయి.  ఢిల్లీలోని డీడీఏ గ్రౌండ్​లో నిర్వహించనున్న ఈ సభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ కోరారు. శనివారం ఆమె హైదరాబాద్​లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో మహాసభల పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా  ఝాన్సీ మాట్లాడుతూ.. మహాసభల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఏబీవీపీ భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తామని వెల్లడించారు.సేవ, పర్యావరణం, విద్యారంగాల్లో అత్యుత్తమ సేవచేసిన వారికి యశ్వంత్ రావు కేల్కర్ యువ పురస్కారం అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శ్రవణ్ బీరాజ్, నేతలు ఛత్రపతి చౌహాన్, శ్రీకాంత్, కమల్ సురేశ్, శ్రీనాథ్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.