OTT Thrillers: ఓటీటీల్లో దూసుకెళ్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్.. ఈ మర్డర్ మిస్టరీస్ చూడకపోతే చూసేయండి

OTT Thrillers: ఓటీటీల్లో దూసుకెళ్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్.. ఈ మర్డర్ మిస్టరీస్ చూడకపోతే చూసేయండి

ప్రస్తుతం ఒక్కో OTTల్లో ఒక్కో హిట్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ స్పెషల్గా థ్రిల్లర్ ఆడియన్స్కు విందుభోజనంలా ఓ రెండు సినిమాలు అదరగొడుతున్నాయి. ఈ సినిమాలు తెలుగు ఒర్జినల్ మూవీస్ కాకపోయినా.. తెలుగు భాషలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సీన్ గూస్బంప్స్ తెప్పించే దిశగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వచ్చాయి. మరి ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయనేది తెలుసుకుందాం..

మండల మర్డర్స్: 

బాలీవుడ్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మండల మర్డర్స్. జూలై 25న నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. గోపి పుత్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వాణీ కపూర్, సుర్వీన్ చావ్లా. విజయ్ రాజ్ గుప్తా, రఘుబీర్ యాదవ్, జమీల్ ఖాన్, మను రిషి చద్దా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్, మండల ప్రాంతంలో జరుగుతున్న హత్యలు, వాటి వెనుక దాగి ఉన్న లోతైన రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఆద్యంతం ఇంట్రెసింగ్ సాగే కథాంశాలకు, డైరెక్టర్ రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే బలంగా నిలిచాయి.  

కథేంటంటే:

ఢిల్లీలో పోలీస్ ఆఫీసర్గా పని చేస్తున్న విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా) కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. దాంతో తన తండ్రి విశ్వనాథ్ (మను రిషి చద్దా) తో కలిసి రైల్లో స్వస్థలం చరణ్దాస్పూరు వెళ్తాడు. అదే రైల్లో కలిసిన తోటి ప్రయాణికుడు అభిషేక్ సహాయ్ (ఆకాష్ దహియా) కూడా వాళ్ల ఊరికి వస్తాడు. అతను స్థానికంగా ఉండే ఒక గ్యాంగ్ స్టర్ తమ్ముళ్లు, రాజకీయ నాయకు రాలు అనన్య భరద్వాజ్ (సర్వీన్ చావ్లా) గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు.

►ALSO READ | HHVM Collection: హరి హర వీరమల్లుకు ఊహించని కలెక్షన్స్.. మూడ్రోజుల్లో ఎన్ని కోట్లంటే?

కానీ, మరుసటి రోజు అతని శవం నదిలో కనిపిస్తుంది. అది చూసిన విక్రమ్సంగ్ ఆహత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆ కేసుని సీఐబీ ఆఫీసర్ రియా థామస్ (వాణీ కపూర్)కు అప్పగిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ హత్య ఎవరు చేశారు? తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి.

రోంత్:

‘రోంత్’ ఇదొక మలయాళ పోలీస్ ప్రొసీజరల్ థ్రిల్లర్. షాహీ కబీర్‌ తెరకెక్కించాడు. ఇందులో రోషన్ మాథ్యూ మరియు దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూన్ 13, 2025న థియేటర్లలలో విడుదలైంది. ఇపుడీ మూవీ ఇవాళ (JULY22) నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. ఇండియాలో మొత్తం రూ.6.58 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9.81 కోట్ల షేర్ సాధించింది.

డైరెక్టర్ షాహీ కబీర్‌.. గతంలో ‘నాయట్టు’,‘ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ’చిత్రాలకు స్క్రీన్‌ రైటర్‌గా పనిచేసిన అనుభవం.. ఈ సినిమాకు పనిచేసింది. ఒకరోజు రాత్రిలో జరిగిన అంశాలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దానికితోడు ఆద్యంతం థ్రిల్లింగ్‌గా కథను చెప్పడంలో ఎమోషన్ తో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ తీసుకొచ్చాడు.

రోంత్ కథేంటంటే:

ఈ కథ ఇద్దరు పోలీసుల నైట్ పెట్రోల్ డ్యూటీ చుట్టూ తిరుగుతుంది. ధర్మస్థల పో లీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న యోహన్నా(దిలీశ్ పోతన్)కు పాతికేళ్ల ఉద్యోగ అనుభవం ఉంది. అదే స్టేషన్లో కానిస్టేబుల్గా చేస్తున్న దిన్నాథ్ (రోషన్ మాథ్యూ) ఉద్యోగానికి కొత్త. అప్పడే భార్యా, పిల్లలతో కలిసి ధర్మస్థలకి వస్తాడు. పెట్రోలింగ్ డ్యూటీలో భాగంగా ఒకరోజు రాత్రి ఈ ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు.

ఆ రోజు వాళ్లకు అనేక సంఘటనలు ఎదుర వుతాయి. లవర్స్ లేచిపోయిన సంఘటన, ఒక సైకో కన్నబిడ్డని డబ్బా కింద దాచిన కేసు. ఒక మహిళ ఆత్మహత్య.. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి పెట్రోలింగ్ పూర్తైందని హాయిగా ఇంటికి వెళ్లిపోతారు. అప్పుడే వాళ్లకు ఒక ఊహించని సమస్య ఎదురవు తుంది? అదేంటి? దాంతో వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.