యూఎస్లో తప్పిన పెను ప్రమాదం.. విమానం టేకాఫ్ అయ్యేలోపే మంటలు, కమ్మేసిన పొగ

యూఎస్లో తప్పిన పెను ప్రమాదం.. విమానం టేకాఫ్ అయ్యేలోపే మంటలు, కమ్మేసిన పొగ
  • టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య
  • ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటికి ప్రయాణికులు
  • యూఎస్ లోని డెన్వర్ ఎయిర్ పోర్ట్ లో ఘటన

న్యూయార్క్ : అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. డెన్వర్ లోని ఎయిర్పోర్ట్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు విమానం టేకాఫ్ అవుతుండగా ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్ వే పై వెళ్తుండగా మంటలు, పొగ వ్యాపించాయి. 

పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే విమానాన్ని ఆపి అందులోని 173 మంది ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ నుంచి సురక్షితంగా బయటకు పంపారు. అయితే ఈ ఘటనలో ఒకరికి మాత్రం స్వల్పగా యాలయ్యాయి. సాయంత్రం 5.10 గంటలకు మంటలను ఆర్పి వేసినట్లు డెన్వర్ అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ విమానం మియామీకి వెళ్లాల్సి ఉంది.

►ALSO READ | కువైట్ కొత్త రూల్.. ఇంతకు మించి మీ దగ్గర ఉంటే సీజ్.. లెక్కచెప్పాల్సిందే..!