
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా గంజాయి సరఫరా చేస్తున్న యువకులు పట్టుబడ్డారు. ఒడిశా నుంచి కరీంనగర్ కు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. మహముత్తారం మండలంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరి దగ్గరల స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆరున్నర కిలోల గంజాయి ఒడిస్సా నుండి కరీంనగర్ కు బైక్ పై తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. దొబ్బలపాడు అలుగువాగు వద్ద పట్టుబడిన ఇద్దరు స్తంభంపల్లికి చెందిన లోక హరిప్రసాద్, అంజి కుమార్ గా పోలీసులు గుర్తించారు.
చట్టవిరుద్ధంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. నిందితుల నుంచి బైక్ స్వాధీనం చేసుకున్నారు.