
దాదాపు రూ.300 కోట్లు, 10 ఏళ్లలో 162 ఫారెన్ ట్రిప్పులు, విదేశాల్లో బ్యాంకు అకౌంట్లు ఇవన్నీ ఓ సెలెబ్రిటీ లేదా అత్యంత సంపన్నుల ఆస్తులు లేక ప్రభుత్వ ఖజానాలోకి వచ్చిన డొనేషన్లు కాదు... ఘజియాబాద్‌లో ఎనిమిది సంవత్సరాలుగా నకిలీ ఎంబసీ ఆఫీస్ నడుపుతు అరెస్టయిన హర్షవర్ధన్ జైన్‌పై చేసిన దర్యాప్తులో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన వివరాలు.
వివరాలు చూస్తే గత వారం ఘజియాబాద్‌లోని రెండంతస్తుల అద్దె ఇంట్లో ఉంటున్న హర్షవర్ధన్ జైన్‌ను అరెస్టు చేశారు. అయితే ఆ ఇంటిని అతను అంబాసి ఆఫీసుగా చెప్పగా, ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) జరిపిన దర్యాప్తులో హర్షవర్ధన్ జైన్ ఓ పెద్ద ఫేక్ ఉద్యోగ రాకెట్టు నడుపుతున్నాడని అలాగే హవాలా ద్వారా మనీలాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు తేలింది.
ఘజియాబాద్ ప్రాంగణంలో జరిగిన ఈ దాడిలో నకిలీ నంబర్ ప్లేట్లు, ఫేక్ డాక్యూమెంట్లు, లగ్జరీ వాచ్ కలెక్షన్‌తో నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.300 కోట్ల కుంభకోణంలో హర్షవర్ధన్ జైన్ ప్రమేయం ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
►ALSO READ | కువైట్ కొత్త రూల్.. ఇంతకు మించి మీ దగ్గర ఉంటే సీజ్.. లెక్కచెప్పాల్సిందే..!
నకిలీ ఎంబసీ ఆఫీస్: ఘజియాబాద్‌లోని ఓ అందమైన రెండంతస్తుల భవనం ముందు గ్రాండ్Grand Duchy of Westarctica ఇంకా H E HV Jain Honorary Consul అని రాసిన నేమ్ ప్లేట్ ఉంది. ఆ ఇంట్లో అంటార్కిటికాలోని మైక్రోనేషన్ అయిన వెస్టార్కిటికా జెండాలు కూడా ఉన్నాయి.
దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం, హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఒక సంస్థను అడ్డం పెట్టుకుని, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసాలకు పాల్పడుతున్నాడు. దర్యాప్తులో తేలిందేమిటంటే ఈ నకిలీ ఎంబాసి ఆఫీస్ 2017 నుంచే నడుస్తోంది. అతని మోసాలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి ఈ ఎంబాసి ఆఫీస్ ముందు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఈ నకిలీ ఆఫీస్ నడుపుతున్నప్పటికీ, అతను ఉండే భవనాన్ని మాత్రం ఆరు నెలల క్రితమే అద్దెకు తీసుకున్నాడు. అంటే, అంతకుముందు అతను వేరే చోట లేదా వేరే పద్ధతిలో ఈ స్కాం నిర్వహించి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ మోసాలు ఎంతకాలంగా జరుగుతున్నాయో, ఎంతమంది బాధితులు ఉన్నారో మరింత దర్యాప్తులో వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు.