విజయ్ దేవరకొండ లవ్ లైఫ్.. ఎట్టకేలకు ఓపెన్ అయిన రౌడీ స్టార్!

విజయ్ దేవరకొండ లవ్ లైఫ్..  ఎట్టకేలకు ఓపెన్ అయిన రౌడీ స్టార్!

టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవకొండ(Vijay Deverakonda)  తన లవ్ గురించి ఓపెన్ అయ్యారు. గతం కొంత కాలంగా  రష్మిక మందన్న( Rashmika Mandanna ) తో డేటింగ్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  అయినా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి బయటపెట్టని విజయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో..  తన భావోద్వేగ ఎదుగుదల గురించి, గత కొన్ని సంవత్సరాలుగా తాను నేర్చుకున్న సంబంధాల పాఠాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

అయితే తన ప్రియురాలి గురించి విజయ్ నేరుగా పేరు చెప్పనప్పటికీ, ఆయన చేసిన వ్యాఖ్యలు రష్మికతో ఆయనకు ఉన్న బంధంపై మరోసారి చర్చనీయాంశమైంది. తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయాన్ని చెప్పేశారు. బంధాలకు మించినది ఏదీ లేదు. గత రెండు సంవత్సరాలుగా తాను పరిణతి చెందుతున్నాని  విజయ్ చెప్పారు . జీవితాన్ని ఎలా జీవించాలో కూడా నేర్చుకున్నానని చెప్పారు. గతంలో ఇలా  లేను. గత రెండుమూడు సంవత్సరాలు నా జీవితం నాకు నచ్చలేదు. నేను మా అమ్మ, నాన్న, నా గర్ల్ ఫ్రెండ్  ,  స్నేహితులతో తగినంత సమయం గడపలేకపోయాను అని అన్నారు.

ఎక్కువ సినిమా కమిట్‌మెంట్లతో బిజీగాఉండటం వల్ల తన వృత్తి డిమాండ్లు వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపాయని విజయ్ చెప్పారు. అలాంటి భావన ఉండకూడదు.  కనుక ఇప్పుడు...  నేను నా వారి కోసం సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తున్నాను. నా స్నేహితుల కోసం, మా అమ్మ, నాన్న కోసం, నా సంబంధాల కోసం సమయం కేటాయిస్తున్నాను అని  అన్నారు, ఈ మార్పు ఉద్దేశపూర్వకమైనది. నిరంతరం జరుగుతోందని స్పష్టం చేశారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 'గీత గోవిందం' (2018)  'డియర్ కామ్రేడ్' (2019) చిత్రాలలో కలిసి నటించినప్పటి నుండి, వారి తెరవెనుక సంబంధంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వారిద్దరూ గత సంవత్సరం మాల్దీవుల పర్యటనకు వెళ్లడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది, నిశ్చితార్థం ప్రకటిస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే, విజయ్ ఆ తర్వాత ఈ పుకార్లను ఖండించారు. అయినప్పటికీ, వారిద్దరూ తరచుగా కలిసి కనిపించడం, ఒకరికొకరు మద్దతుగా నిలవడం, సోషల్ మీడియాలో వారి పోస్టులు వారి బంధంపై చర్చను కొనసాగిస్తున్నాయి.

 విజయ్ దేవకొండ నటించిన స్పై థ్రిల్లర్ 'కింగ్‌డమ్' జూలై 31న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు విజయ్  'SVC 59' మరియు 'VD14' అనే రెండు ముఖ్యమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.  అటు రష్మిక మందన్నకు తీరిక లేకుండా ఉంది. ఆమె ప్రస్తుతం 'పుష్ప 3', 'థామ', 'కాక్‌టెయిల్ 2' , 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.