Vijay Deverakonda: తిరుపతిలో 'కింగ్ డమ్' ఈవెంట్.. విజయ్ దేవరకొండకు నిరసన సెగ

Vijay Deverakonda: తిరుపతిలో  'కింగ్ డమ్'  ఈవెంట్..  విజయ్ దేవరకొండకు నిరసన సెగ

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ), భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashree Borse ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కింగ్ డమ్' ( Kingdom movie ). పాన్ ఇండియా మూవీగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తిరుపతిలో ఈరోజు ( జూలై 26, 2025 ) భారీ ఈవెంట్ ను మూవీ మేకర్స్ సిద్ధం చేశారు.  అయితే  విజయ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. గిరిజన సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది.

గతంలో విజయ్ దేవరకొండ ఓ కార్యక్రమంలో గిరిజనులను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలకు విజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడడం తగని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.  

ALSO READ : War2 : హృతిక్ రోషన్‌ను మించిన జూ. ఎన్టీఆర్ రెమ్యూనరేషన్.. మారిన 'వార్ 2' లెక్కలు!

మరో ఐదు రోజుల్లో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తిరుపతిలో భారీ ఈవెంట్ ను మూవీ మేకర్స్ ఏర్పాటు చేశారు.  ఈ వేదిక మీద నుంచే  'కింగ్ డమ్' ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. గిరిజన సంఘాల నిరసన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగే వేదిక వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ కింగ్ డమ్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను హిందీలో 'సామ్రాజ్య' అనే కొత్త టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో 'ఎన్టీఆర్', తమిళంలో 'సూర్య', హిందీలో ' రణ్ బీర్ కపూర్' వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ఏఏ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే  నటించింది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాలకాలపై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. హై ఆక్టేన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.  జూలై 31న  భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి మరి.