War2 : హృతిక్ రోషన్‌ను మించిన జూ. ఎన్టీఆర్ రెమ్యూనరేషన్.. మారిన 'వార్ 2' లెక్కలు!

War2 : హృతిక్ రోషన్‌ను మించిన జూ. ఎన్టీఆర్ రెమ్యూనరేషన్.. మారిన 'వార్ 2' లెక్కలు!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ , టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Hrithik Roshan ), కియరా అద్వానీ కలిసి నటించిన చిత్రం వార్ 2 (  ( War 2 ).  అయాన్ ముఖర్జీ ( Ayan Mukerji ) డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ భారీ యాక్షన్ మూవీ కోసం అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు.  శుక్రవారం ( జూలై 24, 2025 ) విడుదలైన ట్రైలర్ తర్వాత సినీ ప్రియుల అంచనాలు రెట్టింపు అయ్యాయి.  ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలకానుంది. వార్ 2 తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ .. ఈ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ పై ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలోట్రెండింగ్‌లో ఉంది.

ALSO READ | Mahavatar Narasimha: కొరియన్ , రష్యన్ భాషల్లో 'మహావతార్ నరసింహా' విడుదల.

వరుస విజయాలతో ఫుల్ జోరులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కోసం ఏకంగా రూ. 60 కోట్లు తీసుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో  టాక్ వినిపిస్తోంది.  హృతిక్ రోషన్ రూ. 48 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే రూ. 12 కోట్లు తక్కువ తీసుకున్నారని చర్చించుకుంటున్నారు.  ఇక హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో తన పాత్ర కోసం రూ. 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. 

ఈ మూవీలో హృతిక్ రోషన్ ఏజెంట్ కబీర్‌గా తన పాత్రను తిరిగి పోషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయమవుతూ విలన్‌గా అడుగుపెడుతున్నారు. ఈ మూవీలో కత్తుల పోరాటాలు, కార్ ఛేజ్‌లు, హ్యాండ్-టు-హ్యాండ్ పోరాటాలతో కూడిన అడ్రినలిన్- పంపింగ్ సీక్వెన్సులు ఉన్నాయి. కియారా అద్వానీ బికినీ సీన్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె హృతిక్ రోషన్‌తో రొమాన్స్ చేయనుంది.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వార్ 2 ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని మూవీ మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. 

ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం YRF స్పై యూనివర్స్ లో ఆరవ పార్ట్.  ఈ 'వార్ 2' మూవీ  ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానుంది.  ఇదే రోజు రజనీకాంత్ ( Rajinikanth )  'కూలీ' , ( Coolie) మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు, కలెక్షన్స్ వసూళ్లు చేస్తాయో చూడాలి మరి