Mahavatar Narasimha: కొరియన్ , రష్యన్ భాషల్లో 'మహావతార్ నరసింహా' విడుదల.

Mahavatar Narasimha: కొరియన్ , రష్యన్ భాషల్లో  'మహావతార్ నరసింహా' విడుదల.

అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహావతార్ నరసింహా' ( Mahavatar Narasimha )  సినిమా జూలై 25న దేశవ్యాప్తంగా విడులైంది. బారతీయ పురాణాలను ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులకు చేరువచేయాలన్న లక్ష్యంతో రూపొందించిన చిత్రం ఇది.  భక్తుడైన ప్రహ్లాదుని అచంచలమైన విశ్వాసం, అతని భక్తికి మెచ్చి విష్ణువు నరసింహ అవతారంలో ప్రత్యక్షమై దుష్ట శిక్షణ చేసిన పౌరాణిక గాథను తిరిగి చెప్పింది. థియేటర్లలో సందడి చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ యానిమేషన్  మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి స్కోరును సొంతం చేసుకుంది. విజువల్స్ , టెక్నికల్ గా ప్రశంసలు అందుకుంటుంది.   ఇప్పుడు ఈ సినిమాను గ్లోబలైజ్ చేయాడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం 'మహా అవతార్ నరసింహ' తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ప్రపంచ ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించబడుతుంది. అయితే మరింత మందికి  చేరువ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని కొరియన్, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్, రష్యన్ భాషల్లో విడుదల చేయాలని దర్శకుడు అశ్విన్ కుమార్ యోచిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
 
దర్శకుడు అశ్విన్ కుమార్ తన సృజనాత్మక ప్రభావాలను పంచుకుంటూ, తూర్పు ఆసియా కథన శైలులపై తనకున్న పట్టును వెల్లడించారు.  కొరియన్, జపనీస్ కథన శైలులు,వారి కంటెంట్‌ను చాలా చూస్తాను అని చెప్పారు. మన కంటెంట్‌ను వారికి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన అన్నారు. అంతే కాదు . హోంబలే ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రం, 'మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్' అనే ఒక పెద్ద సినిమా ప్రాజెక్టుకు నాంది పలికింది. ఈ ఫ్రాంచైజ్ తదుపరి 12 సంవత్సరాలలో ఏడు చిత్రాల సిరీస్‌గా రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..

హోంబలే ఫిలింస్ నిర్మించిన మహా అవతార్ జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  భారీ స్థాయి సినిమాటిక్ ప్రాజెక్టుకు 3డిలో తెరకెక్కించారు. 'మహా అవతార్'   రిలీజ్అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం తొలిరోజు రూ.2.29 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీకి క్రేజ్ ఎక్కువగా హిందీ బెల్ట్ నుండి వచ్చింది, ఇక్కడ మాత్రమే ఇది రూ .1.51 కోట్లు వసూలు చేసింది, ఇది దాని మొదటి రోజు వసూళ్లలో 65 శాతానికి పైగా ఉంది. ప్రాంతీయ మార్కెట్లలో తెలుగు వెర్షన్ రూ.38 లక్షలు, కన్నడ వెర్షన్ రూ.7 లక్షలు, మలయాళం రూ.3 లక్షలు, తమిళం రూ.2 లక్షలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ చిత్రాన్ని క్లీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించారు