ఎండాకాలం ఏసీలు వాడుతున్నారా..ఇవి పాటించకపోతే పేలుడు సంభవించే ప్రమాదం!

ఎండాకాలం ఏసీలు వాడుతున్నారా..ఇవి పాటించకపోతే పేలుడు సంభవించే ప్రమాదం!

వేసవి కాలంలో ఇంట్లో, ఆఫీసుల్లో లేదా దుకాణాల్లో దాదాపు ప్రతిచోట ఎయిర్ కండిషనర్లు వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో వేడి భరించలేనిదిగా మారింది.ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. ఈ వేడిని, ఉక్కపోతను తట్టుకునేందుకు ఎయిర్ కండిషన్లు ఉపయోగిస్తుంటాం. AC నుండి వచ్చే చల్లని గాలి ఉపశమనాన్ని అందించినప్పటికీ సరిగ్గా ఉపయోగించకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎండాకాలంలో AC యూనిట్లు పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి కారణం ఏసీ నిర్వహణ సరిగ్గా లేకపోవడమే. 

ALSO READ | వైఫై స్లోగా ఉందా.. ఈ టిప్స్ ఫాలో అయితే.. డబుల్ స్పీడ్ గ్యారెంటీ..

మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ప్రజలు ఎయిర్ కండిషనర్లపై ఆధారపడతారు. 24 గంటలు ఆన్ లోనే ఉంచుతారు. పెరిగిన ఏసీల వినియోగం పేలుళ్లకు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

AC ని ఆపరేట్ చేస్తున్నపుడు కొన్ని ముఖ్యమైన చిట్కాలు 

రెగ్యులర్ సర్వీసింగ్: మీ AC సమర్థవంతంగా పనిచేయాలంటే దానిని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చాలా ముఖ్యం. మీ యూనిట్‌ను దాదాపు 600 గంటలుగా ఉపయోగించినట్లయితే సర్వీస్ చేయించాల్సిందే. 

నిరంతర వాడకాన్ని నివారించండి: ఏసీని చాలామంది 15గంటలు అంతకంటే ఎక్కువ సమయం ఆన్ లోనే ఉంచుతారు. ఇది చాలా పొరపాటు. దీని వల్ల ఏసీ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. 4 నుంచి 5 గంటల తర్వాత యూనిట్‌ను ఆపివేసి ఒకటి లేదా రెండు గంటలు విరామం ఇవ్వడం మంచిది.

ఫిల్టర్ శుభ్రం చేయండి: గాలి ప్రసరింపజేయడంలో ఫిల్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. అది మురికిగా ఉంటే  కంప్రెసర్‌పై అదనపు ఒత్తిడిని పడుతుంది.ఈ సమస్యను నివారించేందుకు ప్రతి 4 నుంచి 5 వారాలకు ఒకసారి AC ఫిల్టర్‌ను శుభ్రం చేయాలి. 

గ్యాస్ లీకేజీలను చెక్ చేయాలి:మీ ACలో గ్యాస్ లీక్ అయితే తీవ్రమైన పేలుళ్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా బయటకు వచ్చే గ్యాస్ వేడి కంప్రెసర్‌తో తాకినప్పుడు  ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో మీ ACని తరచుగా ఉపయోగిస్తుంటే గ్యాస్ లీకేజీ ఉందా అనే తప్పకుండా చెక్ చేయాలి. 

స్టెబిలైజర్ వినియోగించాలి:మీ ప్రాంతంలో విద్యుత్ హెచ్చుతగ్గులు ఉంటే ఏసీ పాడయ్యే అవకాశం ఉంది. నష్టాన్ని నివారించడానికి AC తో నమ్మకమైన స్టెబిలైజర్‌ను ఉపయోగించాలి. 

సరైన ఉష్ణోగ్రతను సెట్టింగ్: ఏసీ సరిగ్గా పనిచేయాలని, మంచి పనితీరును ప్రదర్శించాలన్నా,  కరెంట్ బిల్లులు ఆదా చేయాలన్నా ACని ఎల్లప్పుడూ 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు సెట్ చేసుకోవాలి. ఉష్ణోగ్రతను ఎక్కువగా తగ్గించడం వల్ల కరెంట్ బిల్లుల మోత మోగుతుంది. 

ఈ చిట్కాలను పాటించడం ద్వారా AC సంబంధిత ప్రమాదాల ఇబ్బంది లేకుండా చల్లని ,సురక్షితమైన వేసవిని ఆస్వాదించవచ్చు.