
సాధారణంగా ఇంటర్నెట్ ఫాస్ట్‌గా ఉంటుందని, వేగంగా పనులు పూర్తవుతాయని వైఫై వాడతారు. కానీ, కొన్నిసార్లు వైఫై కూడా స్లో అవుతుంది. అలాంటప్పుడు వైఫై స్పీడ్ పెరగాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే... రూటర్ ఉన్న ప్రదేశం వైఫై వేగాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంటి మధ్యలో లేదా సిగ్నల్ అన్ని రూమ్స్‌కు వెళ్లే ప్రదేశంలో వైఫై ఉంచాలి. ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు సిగ్నల్‌కు డిస్టర్బెన్స్ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి రూటర్‌ను వాటికి దూరంగా ఉంచాలి. అలాగే కొన్నిసార్లు దగ్గర్లో ఉన్న వైఫై నెట్‌వర్క్‌ల వల్ల కూడా స్లో అవ్వొచ్చు.
అలాంటప్పుడు రూటర్ చానెల్ని మార్చడం బెటర్.. రూటర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటో లేదా తక్కువ రష్ ఉన్న చానెల్ని ఎంచుకోవచ్చు. రూటర్ కంపెనీలు కూడా నెట్వర్క్ వేగం, సేఫ్టీ ఫీచర్లను అప్డేట్ చేస్తుంటాయి. కాబట్టి రూటర్ ఫర్మ్‌వేర్‌ను అప్డేట్ చేస్తుండాలి. ఒకే టైంలో ఎక్కువ డివైజ్‌లు కనెక్ట్ అయినప్పుడు స్పీడ్ తగ్గుతుంది. అందుకే వాడని డివైజ్‌లను డిస్కనెక్ట్ చేయాలి. ఇవి ఫాలో అయితే వైఫై స్పీడ్ బెటర్ అవుతుంది.
►ALSO READ | ముక్తా సైనిక్ వాసహత్... ఇది సైనికుల కాలనీ!