ఏసీబీ వలలో జీపీవో... విరాసత్ కోసం రూ.22 వేలు లంచం..

ఏసీబీ వలలో జీపీవో... విరాసత్ కోసం రూ.22 వేలు లంచం..

మంచిర్యాల, వెలుగు: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ మండలం మోసం జీపీవో శ్రీనివాస్ రూ.22 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఓ రైతు రెవెన్యూ రికార్డుల్లో తన పేరు సరిచేయడంతో పాటు, తనకు చెందిన 18 ఎకరాల భూమిని ఇద్దరు కొడుకుల పేరిట విరాసత్ చేయించేందుకు జీపీవోను సంప్రదించాడు. 

ఈ పనుల కోసం శ్రీనివాస్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేయగా, అంత మొత్తం ఇవ్వలేనని రైతు బతిమాలడంతో రూ.22 వేలకు ఒప్పుకున్నాడు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ లంచం కోసం వేధించడంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. దీంతో గురువారం కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ తహసీల్దార్ ఆఫీస్​పై అంతస్తులో లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. 

అనంతరం అతడిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 లేదా 91543 88963 కు సమాచారమివ్వాలని మధు కోరారు.