అచ్చెనాయుడు కి బెయిల్ నిరాక‌రించిన ఏసీబీ కోర్టు ‌

అచ్చెనాయుడు కి బెయిల్ నిరాక‌రించిన ఏసీబీ కోర్టు ‌

టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిష‌న్ ను ఎసిబి కోర్టు నిరాకరించింది. ఇఎస్ఐ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అచ్చెనాయుడు ప్ర‌స్తుతం విజ‌య‌వాడ స‌బ్ జైలు లో ఉన్నారు.. ఈ కేసులో ఆయ‌న బెయిల్ మంజూరు చేయ‌వ‌ల‌సిందిగా ఎసిబి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

తాను అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ అచ్చెన్న హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తనను ఆస్పత్రికి తరలించాలంటూ అచ్చెన్న ఈ పిటిషన్ లో కోరారు. దీనిపై ఈ మధ్యాహ్నం వాదనలు జరిగాయి.  తమ క్లయింటు రోజువారి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కూడా వీలుకాని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, మెరుగైన చికిత్స కోసం  ఆస్పత్రికి తరలించే ఆదేశాలు ఇవ్వాలని అచ్చెన్న తరఫు  లాయర్ హైకోర్టుకు విన్నవించారు. దీనిపై డిఫెన్స్ లాయర్ వాదిస్తూ, అచ్చెన్నాయుడికి పూర్తిస్థాయిలో చికిత్స జరిగిందని, మెరుగైన వైద్యం అందించామని తెలిపారు. మరే ఇతర వైద్యం అవసరంలేదని వాదించారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.