SS Rajamouli: ప్రియాంక చోప్రా నటనకు జక్కన్న ఫిదా.. ‘ది బ్లఫ్’ ట్రైలర్‌పై రాజమౌళి క్రేజీ కామెంట్స్!

SS Rajamouli: ప్రియాంక చోప్రా నటనకు జక్కన్న ఫిదా.. ‘ది బ్లఫ్’ ట్రైలర్‌పై రాజమౌళి క్రేజీ కామెంట్స్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో వైవిధ్యమైన ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది . ఒకవైపు తన అప్ కమింగ్ హాలీవుడ్ చిత్రం 'ది బ్లఫ్' (The Bluff) విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఇండియన్ సెల్యులాయిడ్ మాంత్రికుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' లో నటిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ రెండు భారీ చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ప్రియాంకపై రాజమౌళి ప్రశంసల జల్లు!

ఇటీవల రిలీజైన 'ది బ్లఫ్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చూసిన జక్కన్న, ప్రియాంక నటనకు ఫిదా అయిపోయారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేకంగా పోస్ట్ చేస్తూ.. "ప్రియాంకను ఎవరూ ఆపలేరు, ఆమె ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తన నటనలో ఒక అద్భుతమైన కమాండ్, తీక్షణత (Fiery Performance) కనిపిస్తోంది. నేను 'ది బ్లఫ్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ ప్రశంసించారు. దీనికి స్పందించిన ప్రియాంక..  "థాంక్యూ సో మచ్ సర్" అంటూ కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి ఈ హాలీవుడ్ సినిమా గురించి ఇలా పోస్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

'ది బ్లఫ్'.. కథేంటంటే?

19వ శతాబ్దపు కరీబియన్ దీవుల నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా 'ది బ్లఫ్' మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియాంక ఒక మాజీ సముద్రపు దొంగ (Pirate) పాత్రలో కనిపిస్తుంది. గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తున్న ఆమె జీవితంలోకి పాత శత్రువులు తిరిగి వస్తారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు కార్ల్ అర్బన్ ఇందులో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు.  'సిటాడెల్' తర్వాత ఏజీబీఓ (AGBO) స్టూడియోస్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ భాగస్వామ్యంలో ప్రియాంక చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. యాక్షన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ది బ్లఫ్', ఫిబ్రవరి 25న నేరుగా ప్రైమ్ వీడియో (Prime Video) లో విడుదల కానుంది. హాలీవుడ్ స్థాయిలో ప్రియాంక చేస్తున్న ఈ యాక్షన్ విన్యాసాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

 'వారణాసి'లో మందాకినిగా ప్రియాంక!

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా,  పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'వారణాసి'. ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి కొన్ని క్రేజీ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో ప్రియాంక 'మందాకిని' గా కనిపించబోతుండగా, మహేష్ బాబు 'రుద్ర' గా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే శక్తివంతమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ అడ్వెంచర్ డ్రామా 2027 శ్రీరామ నవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి మార్క్ గ్రాండియర్ ఈ సినిమాలో కనిపించనుంది. మొత్తానికి, ఇటు హాలీవుడ్ 'ది బ్లఫ్'తో తన మార్కెట్‌ను సుస్థిరం చేసుకుంటూనే, అటు రాజమౌళి 'వారణాసి'తో మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రీ-ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక.