ఏసీబీకి పట్టుబడ్డ జగ జ్యోతికి రిమాండ్‌‌

ఏసీబీకి పట్టుబడ్డ జగ జ్యోతికి రిమాండ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు :  లంచం తీసుకుంటు పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటీవ్‌‌ ఇంజనీర్‌‌‌‌ జగజ్యోతికి ఏసీబీ కోర్టు రిమాండ్‌‌ విధించింది. మార్చి 6 వరకు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జగజ్యోతిని ఏసీబీ అధికారులు చంచల్‌‌గూడ మహిళ జైలుకు తరలించారు. కాంట్రాక్టర్‌‌‌‌ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ జగజ్యోతి సోమవారం ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.

ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే సమయంలో అస్వస్థతకు గురైంది. దీంతో ఉస్మానియా హాస్పిటల్‌‌కి తరలించి చికిత్స అందించారు. కోర్టుకు సమాచారం అందించారు. జగజ్యోతికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్లు సూచించడంతో హెల్త్‌‌ రిపోర్ట్‌‌ ఆధారంగా బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో చంచల్‌‌గూడ మహిళా జైలుకు తరలించారు.