హైదరాబాద్: మరో 15 ఏండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది రుజువైందని చెప్పారు. నల్లగొండ జిల్లా మిర్యాల గూడలో రూ.180.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ , ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కోమటిరెడ్డి మా ట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక పార్టీకి డిపాజిట్ గల్లంతైందని.. మరో పార్టీ కుటుంబ కలహాలతో నాలుగు ముక్కలైందని సెటైర్ వేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్య ర్థులను గెలిపిస్తే వారి ద్వారా అన్నిరం గాల్లో మరింత అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పదేండ్లలో జరగని అభివృ దీని రెండేండ్లలోనే చేసి చూపించామన్నా రు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తందని చెప్పారు.
