- ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ ఐపీఎస్
ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్స్కోసం ‘సివిల్ సర్వీసెస్లో రాణించడం ఎలా’ అనే అంశంపై గురువారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ఇన్స్టిట్యూట్స్ కరస్పాండెంట్ సరోజా వివేక్, ఏసీబీ డైరెక్టర్ విజయకుమార్ ఐపీఎస్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవకుండా నిత్య అధ్యయనం, కఠోర శ్రమ, అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. పుస్తకాలు, వార్తాపత్రికలు, జర్నల్స్, కాంపిటీషన్ సక్సెస్లపై అధ్యయనం చేస్తే సివిల్ సర్వీసెస్లో విజయం సాధించవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్స్, ఇతర అలవాట్ల వల్ల యువత మానసిక ఒత్తిడికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారిగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఇన్స్టిట్యూట్ సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపాల్ మట్ట శేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు
పాల్గొన్నారు.
