ఇంటి అసెస్‌‌మెంట్‌‌ కోసం రూ. 6 వేలు డిమాండ్‌‌..ఏసీబీకి చిక్కిన నిర్మల్‌‌ మున్సిపల్‌‌ ఇన్‌‌చార్జి ఆర్‌‌ఐ,

ఇంటి అసెస్‌‌మెంట్‌‌ కోసం రూ. 6 వేలు డిమాండ్‌‌..ఏసీబీకి చిక్కిన నిర్మల్‌‌ మున్సిపల్‌‌ ఇన్‌‌చార్జి ఆర్‌‌ఐ,
  • ఏసీబీకి చిక్కిన నిర్మల్‌‌ మున్సిపల్‌‌ ఇన్‌‌చార్జి ఆర్‌‌ఐ, మరో ఔట్‌‌సోర్సింగ్‌‌ ఉద్యోగి

నిర్మల్, వెలుగు : ఇంటి అసెస్‌‌మెంట్‌‌ కోసం లంచం డిమాండ్‌‌ చేసిన నిర్మల్‌‌ మున్సిపల్‌‌ ఇన్‌‌చార్జి ఆర్‌‌ఐతో పాటు మరో ఔట్‌‌సోర్సింగ్‌‌ ఉద్యోగిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఆదిలాబాద్‌‌ ఏసీబీ డీఎస్పీ విజయ్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... నిర్మల్‌‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ ఇంటికి అసెస్‌‌మెంట్‌‌ చేయాలని మున్సిపల్‌‌ ఇన్‌‌చార్జి ఆర్‌‌ఐ, సీనియర్‌‌ అసిస్టెంట్‌‌ గైక్వాడ్‌‌ సంతోష్‌‌ను సంప్రదించాడు.

అయితే రూ. 6 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని ఇన్‌‌చార్జి ఆర్‌‌ఐ స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం నిర్మల్‌‌ మున్సిపల్‌‌ ఆఫీస్‌‌కు వెళ్లిన బాధితుడు ఆర్‌‌ఐ అసిస్టెంట్‌‌, ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగి షోయబ్‌‌ అహ్మద్‌‌కు డబ్బులు ఇచ్చాడు. అతడు ఆ డబ్బులను ఆర్‌‌ఐ గైక్వైడ్‌‌ సంతోష్‌‌కు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఆర్‌‌ఐతో పాటు ఔట్‌‌సోర్సింగ్‌‌ ఉద్యోగిని రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. నిందితులిద్దరినీ కరీంనగర్‌‌ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.