సొసైటీ కోసం రూ. 75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్

సొసైటీ కోసం రూ. 75 వేలు లంచం తీసుకుంటూ  ఏసీబీకి దొరికిన మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్

తెలంగాణలో ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. లంచాలు తీసుకునే ప్రభుత్వ అధికారుల భరతం పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో లంచగొండులను పట్టుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకే  వందలాది ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. 

 ఇవాళ అక్టోబర్ 17న  వరంగల్ లో మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీకి దొరికాడు.  రూ. 75 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు.  ఓ సొసైటీకి సంబంధించి రూ,. 75 వేలు లంచం డిమాండ్  చేశాడు ఆఫీసర్. జిల్లా అధికారి నాగమణి ఆదేశాలతో హరీశ్ లంచం అడిగాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.

 గురువారం (అక్టోబర్ 16)నల్లగొండ జిల్లాలో టపాసుల వ్యాపారి నుంచి  రూ 8 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అగ్నిమాపక శాఖ అధికారి ఏ. సత్యనారాయణ రెడ్డి. పండుగ సందర్భంగా క్రాకర్స్ షాపు ఏర్పాటు చేయడానికి షాపు నిర్వాహకుడి నుంచి 8 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.