హాస్టల్స్ బాగోతాలు బయటపడుతున్నాయ్ రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాలపై ఏసీబీ రైడ్స్

హాస్టల్స్ బాగోతాలు బయటపడుతున్నాయ్ రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాలపై ఏసీబీ రైడ్స్

రాష్ట్రంలోని పలు గవర్నమెంట్ హాస్టల్స్ పై మంగళవారం ఏసీబీ అధికారులు విరుచుకుపడ్డారు. ఏకకాలంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, గురుకులాల సంక్షేమ వసతి గృహాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు ఏసీబీ అధికారులు టీంలుగా విడిపోయి రైడ్స్ చేశారు. హైదరాబాద్ మల్లాపూర్ లోని బిసి బాయ్స్ హాస్టల్ లో ఎసిబి అధికారుల సోదాలు నిర్వహించారు. 

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్న ఎసిబి అధికారులు. అలాగే సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ డిఎస్పీ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. ర్యాండం సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ప్రభుత్వ హాస్టల్స్ పై రైడ్స్ నిర్వహిస్తున్నారు. 

వసతి గృహాల్లో ఉన్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫుడ్ మెనూ, వంట సరుకులు, భోజనం క్వాలిటీని ఫుడ్ సేఫ్టీ అధికారులు, మెట్రాలజీ అధికారులు పరిశీలిస్తు్న్నారు. అవినీతికి పాల్పడిన హాస్టల్ ఆఫీసర్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. వార్డెన్ ను అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 

ఈరోజు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించడానికి వెళ్తున్నారు. గతకొన్ని రోజులుగా అక్కడి విద్యార్థులు వరసగా పాముకాట్లకు గురై మృతి చెందారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం స్పందించింది. గురుకుల హాస్టల్ పర్యవేక్షించడానికి డిప్యూటీ సీఎం, మినిస్టర్ బయల్దేరారు.