
వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఆఫీసులో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ దాడుల్లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు రెవెన్యూ ఆఫీసర్. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో నిర్వహించిన ఈ దాడుల్లో రెవెన్యూ అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
మ్యుటేషన్ కోసం ఆశ్రయించిన బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు రెవెన్యూ ఆఫీసర్ రమేష్. దీంతో ఏసీబీని ఆశ్రయించారు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో మున్సిపల్ ఆఫీసుపై దాడులు నిర్వహించిన అధికారులు రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.రెవెన్యూ ఆఫీసర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల మెరుపు దాడులతో దూకుడు పెంచారు ఏసీబీ అధికారులు. ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తూ అవినీతి అధికారులను కట్టడి చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు ఏసీబీ అధికారులు.