ఏపీలో సబ్ రిజిస్ట్రేట్ ఆఫీసుల్లో భారీ దోపిడీ.. ఏసీబీ సోదాల్లో షాకింగ్ నిజాలు..

ఏపీలో సబ్ రిజిస్ట్రేట్ ఆఫీసుల్లో భారీ దోపిడీ.. ఏసీబీ సోదాల్లో షాకింగ్ నిజాలు..

ఏపీలో సబ్ రిజిస్ట్రేట్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. బుధవారం ( నవంబర్ 5 ) రెండో రోజు అర్థరాత్రి వరకు జరిగిన ఏసీబీ సోదాల్లో భాగంగా పలు కీలక డాక్యుమెట్స్ స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ క్రమంలో ఏసీబీ సోదాల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.. విశాఖపట్నం,విజయనగరం, ,ఎన్టీఆర్,పల్నాడు,ప్రకాశం, చిత్తూరు,కడప, అనంతపురం,కర్నూలు జిల్లాల్లోనీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు అధికారులు.

జిల్లా రిజిస్టర్లతో కలిసి సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఈ సోదాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు.ఎనీవేర్ రిజిస్ట్రేషన్ను అడ్డం పెట్టుకొని భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు అధికారులు. భూముల విలువను బట్టి రిజిస్ట్రేషన్ కు కమిషన్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ప్రజల నుంచి వచ్చిన ఫర్యాదుతో ప్రభుత్వ ఆదేశాలతో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు.

సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రవేట్ వ్యక్తులతో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు అధికారులు. పలు జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తిష్ట వేసిన డాక్యుమెంట్ రైటర్లను పిలిపించి ఫోన్లు సీజ్ చేశారు అధికారులు. ఈ అక్రమాల్లో జిల్లా రిజిస్ట్రార్ల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్లు  ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నా జిల్లా రిజిస్ట్రార్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు..

నెల రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్స్,ఆర్థిక  లావాదేవీలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇవాళ మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాలు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతిపై ఇటీవల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు అధికారులు. రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే   కమిషన్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన చోట ఏసీబీ సోదాలకు ఆదేశాలు జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.