గొర్రెల పంపిణీలో అక్రమాలపై..కేసు నమోదు చేసిన ఏసీబీ

గొర్రెల పంపిణీలో అక్రమాలపై..కేసు నమోదు చేసిన ఏసీబీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిపై ఏసీబీ ఫోకస్‌‌‌‌ పెట్టింది. ఇటీవల గచ్చిబౌలి పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో నమోదైన కేసును టేకోవర్‌‌‌‌ చేసింది. గచ్చిబౌలి పీఎస్‌‌‌‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా సోమవారం కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ తెలిపారు.

గొర్రెల స్కామ్‌‌‌‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను రెండు మూడు రోజుల్లో విచారించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలో నమోదైన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లో పేర్లు ఉన్న అధికారులను మొదట విచారించనున్నట్లు తెలుస్తున్నది. ఇద్దరు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్లు రవికుమార్‌‌‌‌, కేశవసాయి, కొండాపూర్‌‌‌‌కు చెందిన ‘లోలోనా ది లైవ్‌‌‌‌’ కంపెనీ కాంట్రాక్టర్ సయ్యద్‌‌‌‌ మొయిద్‌‌‌‌కు అక్రమాల్లో ప్రమోయం ఉన్నట్లు సమాచారం.