తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో.. ఏసీబీ అధికారులు మరో కీలక అడుగు వేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇండ్లలో ఏసీబీ దాడులు చేస్తోంది
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో.. ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కేవలం భుజంగరావు నివాసంలోనే కాకుండా.. ఆయనకు సంబంధించిన మొత్తం 15 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌తో పాటు సూర్యాపేటలోని భుజంగరావు బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేస్తున్నాయి. ఆయన సర్వీస్ కాలంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఫోన్ టాపింగ్ కేసుతో పాటు ఇప్పుడు ఈ అవినీతి తిమింగలం ఆస్తుల చిట్టా కూడా బయటకు రానుండటం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
