
ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ మున్సిపల్ ఏఈ రాజశేఖర్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సన్నీ ఏసీబీకి చిక్కారు. వినాయక చవితి నేపథ్యంలో ఎదులాబాద్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనాల కోసం క్రేన్లు ఏర్పాటు చేశారు. సదరు కాంట్రాక్టర్‌కు రూ.12 లక్షల క్రేన్ బిల్లులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పడ్డారు. క్రేన్ డబ్బులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం బోడుప్పల్ లోని తన ఇంట్లో రాజశేఖర్‌కు రూ.50 వేల నగదు, వర్క్ ఇన్స్ పెక్టర్ సన్నీకి రూ. 30 వేలను గూగుల్ పే చేశాడు. వీరిద్దరని ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.