OTT Crime Comedy: ఓటీటీలో దూసుకెళ్తున్న మలయాళం క్రైమ్ కామెడీ సిరీస్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Crime Comedy: ఓటీటీలో దూసుకెళ్తున్న మలయాళం క్రైమ్ కామెడీ సిరీస్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓ కొత్త మలయాళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తుంది. అదే ‘ది క్రానికల్స్ ఆఫ్ ది 4.5 గ్యాంగ్’. లేదా 'సంభావవివరనం నలరా సంఘం'. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 29న సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. పురుష ప్రేతమ్ లాంటి హారర్ థ్రిల్లర్ అందించిన డైరెక్టర్ క్రిషాంద్ నుంచి సిరీస్ రావడంతో అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ది క్రానికల్స్ సిరీస్ కథ, కథనం సాగింది. 

ఇది కొంతమంది యువకుల గ్రూప్ చుట్టూ కథ తిరుగుతుంది. సంజు శివరామ్, నురంజ్, శ్రీంత్ బాబు, జగదీష్, ఇంద్రన్స్, శంభు, నిరంజ్ మణియన్ పిల్ల రాజు, సచిన్ జోసెఫ్ల గ్రూప్ యాక్టింగ్కి ఫిదా అవ్వాల్సిందే. ఓ కామన్ కుర్రాళ్లు.. పాలు, పూల మార్కెట్లను కంట్రోల్ చేసే క్రూరమైన లోకల్ క్రిమినల్స్‌గా ఎలా మారతారనే కాన్సెప్ట్ ఆసక్తిగా ఉంటుంది. ఇందులో అనుపమ 'పరదా' మూవీలో నటించిన దర్శన రాజేంద్రన్ నెగటివ్ రోల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. 

ఈ మలయాళ సిరీస్ తెలుగు ఆడియన్స్కు మంచి ట్రీట్ అందించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అందుకు గల ముఖ్య కారణం.. ఇందులో క్రైమ్, లవ్, రొమాన్స్, కామెడీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పడి పడి నవ్వుకోవడం కాదు, ఇంట్రెస్టింగ్గా కథనంపై లుక్కేస్తారు. ఇక ఆలస్యం ఎందుకు.. "ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్" తో వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.  

కథేంటంటే:

అరికుట్టన్ (సంజు శివరామ్) ఒక గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌. అతని బయోగ్రఫీతో సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు. తన కథ రాయడానికి రచయిత మైత్రేయన్ (జగదీష్)ని ఎంచుకుంటాడు. అతనికి కథ చెప్పడం మొదలుపెడతాడు. 1990ల్లో రాజకీయ తగాదాలు, అవినీతి పోలీస్ అధికారులతో తిరువంచిపురం గందరగోళంగా ఉండేది. విచ్చలవిడిగా డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగేది.

అరికుట్టన్‌‌కు నలుగురు ఫ్రెండ్స్ కంజి (శ్రీనాథ్ బాబు), మణియన్ (శంభు), అల్తాఫ్ (నిరంజ్ మణియన్ పిల్ల రాజు), మూంగా (సచిన్ జోసెఫ్) ఉంటారు. వీళ్లలో మూంగా మరుగుజ్జు కావడం వల్ల అందరూ వాళ్లను 4.5 గ్యాంగ్‌‌ అని పిలుస్తుంటారు.

ఎలాగైనా తాము కూడా రౌడీ గ్యాంగ్‌‌గా ఎదగాలని అరికుట్టన్, అతని ఫ్రెండ్స్‌‌ అనుకుంటారు. అందుకే ఒక పెద్ద ప్లాన్‌‌ వేస్తారు. వాళ్ల టౌన్ నుంచి రోజూ కొన్ని వేల లీటర్ల పాలు సిటీకి పంపిస్తున్నారని తెలిసి, ప్రతిరోజూ వెయ్యి లీటర్లు కాజేయాలి అనుకుంటారు. తర్వాత ఏం జరిగింది? వాళ్ల గ్యాంగ్‌‌ ఎలా ఎదిగింది? తెలుసుకోవాలంటే సినిమా ఈ వెబ్‌‌ సిరీస్‌‌ చూడాలి.