
గూగుల్ ట్రాన్స్లేట్ కొత్త ఏఐ బేస్డ్ లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ట్రాన్స్లేషన్తోపాటు లాంగ్వేజ్ ట్రైనర్‌గానూ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ కాస్త భాష వచ్చినప్పటికీ ఇంకా మెరుగుపరచుకునేందుకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవల్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీకు కావాల్సిన లెవల్స్‌లో లెర్నింగ్ స్కిల్స్ ఎంచుకోవచ్చు. అంతేకాకుండా వినడం, మాట్లాడటం వంటి సెషన్లు కూడా డిజైన్ చేస్తుంది. దీనివల్ల భాష నేర్చుకోవడం ఒక గేమ్‌లా అనిపిస్తుంటుంది. దీంతో దాదాపు 40 భాషలు నేర్చుకోవచ్చు.
గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ మాక్ కన్వర్సేషన్ ద్వారా స్కిల్స్ నేర్పిస్తుంది. ఇప్పటికైతే ఈ ఫీచర్ బీటా వెర్షన్లో ఉంది. అంతేకాదు.. ఈ లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్లో గూగుల్ జెమిని ఏఐ మోడల్‌ను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ట్రాన్స్లేషన్ క్వాలిటీ మెరుగవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, తమిళం, అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లిష్ వంటి కొన్ని భాషలకు సపోర్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ వాడాలంటే గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత స్కిల్ లెవల్స్, టార్గెట్ సెట్ చేసుకుంటే లెర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు.
వాట్సాప్‌లో ‘రైటింగ్ హెల్ప్’ తీసుకోవచ్చు!
వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ సెండ్ చేశాక టైపింగ్ మిస్టేక్స్ వస్తే వెంటనే ఎడిట్ చేసుకునేలా ఈ మధ్యే ఎడిట్ ఆప్షన్ వచ్చింది. అయితే ఇప్పుడు రైటింగ్ హెల్ప్ అనే ఏఐ బేస్డ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇది వాట్సాప్‌లో మెసేజ్ పంపే ముందు దాన్ని ఎడిట్ చేయడానికి, తిరిగి రాయడానికి లేదా టోన్ మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రొఫెషనల్, హ్యూమర్, సపోర్టివ్‌గా మార్చడానికి రైటింగ్ హెల్ప్ ఫీచర్ సలహాలు ఇస్తుంది. యూజర్ల ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాట్సాప్ ఈ ఫీచర్‌ను మెటా ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో డిజైన్ చేసింది.
దీంతో మెసేజ్‌లు లేదా ఏఐ సజెస్ట్ చేసిన మార్పులను మెటా, వాట్సాప్ చూసే వీలు ఉండదు. ఈ ఫీచర్ వాడాలా? వద్దా? అనేది యూజర్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది డిఫాల్ట్‌గా డిసేబుల్‌లో ఉంటుంది. కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఫీచర్ యూజర్ సెలక్ట్ చేసుకున్న మెసేజ్‌లకు మాత్రమే పనిచేస్తుంది. పూర్తి చాట్‌కు కాదు. యూజర్ పర్మిషన్ లేకుండా ఏఐ జనరేట్ చేసిన మెసేజ్‌లను ఎప్పటికీ సెండ్ చేయదు.