
ఆసియా కప్ 2025 వేదికలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగబోయే ఈ టోర్నీ అన్ని మ్యాచ్ లు దుబాయ్, అబుదాబిలో జరుగుతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) శనివారం ధృవీకరించింది. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య అబుదాబిలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్ధులు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా దాయాధి జట్లు దుబాయ్ వేదికగానే లీగ్ మ్యాచ్ ఆడడం విశేషం. ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరుగుతుంది.
ఓవరాల్ గా దుబాయ్ 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. 8 మ్యాచ్‌లు అబుదాబిలో జరుగుతాయి. ఇండియా మ్యాచ్ ల విషయానికి వస్తే
సెప్టెంబర్ 10న యుఎఇతో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది. సూపర్ 4 సెప్టెంబర్ 20 నుండి 26 వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 28న జరగనున్న టోర్నమెంట్ ఫైనల్‌కు దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది.
Also Read : ఒంటి చేత్తో పాక్‌ను ఓడించిన డివిలియర్స్
మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. 2023లో జరిగిన గత ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్థాన్ సూపర్-4 కు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే గ్రూప్ లో బలహీనమైన ఒమాన్, యూఏఈ కూడా ఉండడంతో రెండు జట్లు సూపర్-4కు చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఆసియా కప్ పూర్తి షెడ్యూల్
సెప్టెంబర్ 9 - ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ (అబుదాబి)
సెప్టెంబర్ 10 - భారత్ vs యుఏఈ (దుబాయ్)
సెప్టెంబర్ 11 - బంగ్లాదేశ్ vs హాంకాంగ్ (అబుదాబి)
సెప్టెంబర్ 12 - పాకిస్తాన్ vs ఒమన్ (దుబాయ్)
సెప్టెంబర్ 13 - బంగ్లాదేశ్ vs శ్రీలంక (అబుదాబి)
సెప్టెంబర్ 14 - భారత్ vs పాకిస్థాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 15 - యుఎఇ vs ఒమన్ (అబుదాబి) మరియు శ్రీలంక vs హాంకాంగ్ (దుబాయ్)
సెప్టెంబర్ 16 - బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (అబుదాబి)
సెప్టెంబర్ 17 - పాకిస్తాన్ vs UAE (దుబాయ్)
సెప్టెంబర్ 18 - శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (అబుదాబి)
సెప్టెంబర్ 19 - భారత్ vs ఒమన్ (అబుదాబి)
సూపర్ 4
సెప్టెంబర్ 20 - బి1 vs బి2 (దుబాయ్)
సెప్టెంబర్ 21 - AI vs A2 (దుబాయ్)
సెప్టెంబర్ 23 - A2 vs B1 (అబుదాబి)
సెప్టెంబర్ 24 - A1 vs B2 (దుబాయ్)
సెప్టెంబర్ 25 - A2 vs B2 (దుబాయ్)
సెప్టెంబర్ 26 - A1 vs B1 (దుబాయ్)
సెప్టెంబర్ 28 - ఫైనల్ (దుబాయ్)
🚨 OFFICIAL: Dubai and Abu Dhabi will host the Asia Cup 2025 with the final to be played in Dubai!#AsiaCup2025 #Pakistan #India pic.twitter.com/H2K4lw7y7B
— Ramzy 🇵🇰🇬🇧 (@Ramz_004) August 2, 2025