25 వేల మందిపై యాక్సెంచర్ వేటు

25 వేల మందిపై యాక్సెంచర్ వేటు

వందల మంది ఇండియన్ల జాబ్స్ గల్లంతు
న్యూఢిల్లీ: గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ యాక్సెంచర్ 25 వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తనకున్న వర్క్‌‌ఫోర్స్‌‌లో ఐదు శాతం మందిని తొలగిస్తున్నట్టు తెలిపింది. తక్కువ పర్‌‌‌‌ఫార్మ్ చేసిన ఉద్యోగులపై ఈ వేటు ఉంటోంది. యాక్సెంచర్‌‌‌‌లో పనిచేసే ఇండియన్లలో కూడా వందల మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. మరోవైపు కరోనా ఔట్‌‌బ్రేక్‌‌తో కంపెనీ వ్యాపారాలు కూడా తగ్గాయి. ఆస్ట్రేలియా ఫైనాన్సియల్ రివ్యూ ఈ విషయాన్ని తొలిసారి రిపోర్ట్ చేసింది. కంపెనీ సీఈవో జులీ స్వీట్ ఆగస్ట్‌‌మధ్యలోనే ఉద్యోగులతో ఇంటర్నల్‌‌గా మీటింగ్ కూడా నిర్వహించినట్టు పేర్కొంది.

‘ప్రతేడాది పర్‌‌‌‌ఫార్మెన్స్ ప్రాసెస్‌‌లో భాగంగా, చాలా మంది ఉద్యోగులతో మేము మాట్లాడుతుంటాం. వారి పర్‌‌‌‌ఫార్మెన్స్, ప్రొగ్రెస్, యాక్సెంచర్‌‌‌‌లో ఎక్కువ కాలంలో పనిచేసేందుకు వారు అర్హులా? కాదా ? అనే విషయాలను చర్చిస్తాం’ అని యాక్సెంచర్ తెలిపింది. ఈ ఏడాది కూడా చేపట్టిన ఈ ప్రక్రియలో, సుమారు 5 శాతం ఉద్యోగులు తక్కువ పర్‌‌‌‌ఫార్మెన్స్ చూపించినట్టు గుర్తించామని తెలిపింది. వీరు యాక్సెంచర్ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుందని పేర్కొంది. ప్రతేడాది ఇలాంటివి ఉంటాయని చెప్పింది. యాక్సెంచర్‌‌కు‌‌120కి పైగా దేశాల్లో ఐదు లక్షలకుపైగా ఎంప్లాయిస్‌‌ ఉన్నారు.