
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నారం వై జంక్షన్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. ఆదివారం సెలవు కావడంతో కొంతమంది యువకులు సరదాగా చేపలు పట్టడం కోసం జడ్చర్లకు బయలుదేరారు. వీరంతా రెండు కార్లలో వెళ్తుండగా.. అందులో ఒక స్విఫ్ట్ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దాంతో కారులోని ముగ్గురు యువకుల్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన యువకులు మలక్‌పేట్‌కి చెందనివారుగా తెలుస్తోంది. సరదా కోసం ఫిష్ హంట్‌కి బయలుదేరితే హ్యూమన్ హంట్‌గా మారిందని తోటి స్నేహితులు వాపోతున్నారు.