గనిలో ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం

గనిలో ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం

 భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని దంతెవాడ జిల్లా కిరండోల్​ఎన్ఎండీసీ(నేషనల్​ మినరల్​ డెవలప్ మెంట్​ కార్పొరేషన్​) ఐరన్​ గనిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. వాల్​ నిర్మాణం కోసం గుట్టలను తవ్వుతున్న కూలీలపై పెద్ద పెద్ద మట్టి పెళ్లలు పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో ఆరుగురు మట్టి పెళ్లల కిందే చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గనిలో లార్సెన్ అండ్​ టర్బో(ఎల్​అండ్​టీ) కంపెనీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ స్క్రీనింగ్ ప్లాంట్​కు రిటైనింగ్​ వాల్​ నిర్మాణం జరుగుతున్నది. అందుకు గుట్టలను తవ్వుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.  ఎస్డీఆర్ఎఫ్​( స్టేట్ డిజాస్టర్​ రెస్పాన్స్ ఫోర్స్) ఆధ్వర్యంలో రెస్క్యూ జరుగుతున్నదని పేర్కొన్నారు.