
గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. గంజాయి మాఫియా ఎక్కడా తగ్గడం లేదు. ఒక రూట్లో పోలీసులు కట్టడి చేస్తే మరో రూట్లో సరఫరా చేస్తూ పట్టుబడుతున్నారు. గురువారం (ఆగస్టు 07) నల్గొండ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది.
నల్లగొండ జిల్లా చిట్యాల హైవే 65పై గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. రహస్యంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. మూడు కార్లలో గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురు నిందితులలో ఆరుగురు పరారయ్యారు. ఒకరిని అరెస్టు చేశారు.
మొత్తం 125 ప్యాకెట్ లలో సుమారు 250 కేజీల గంజాయి, రెండు కార్లు ( DL 4C AN 8182, DL 9C AN 6689), 6 సెల్ ఫోన్స్, ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న నెంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఢిల్లీ కి తరలిస్తుండగా పక్క సమాచారం తో మాటువేసి పట్టుకున్నారు చిట్యాల పోలీసులు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న నూర్ మహ్మద్ అలియజ్ రాజా అనే A3 పై కేసు నమోదు చేసి రిమండ్ కి తలించారు. పరారిలో ఉన్న నిందితులను ఢిల్లీ, యూపీ కి చెందిన వారిగా గుర్తించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని వెల్లడించారు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి.
గంజాయిని తరలించేందుకు ప్రత్యేక యాప్ క్రియేట్ చేసి రవాణా చేస్తున్నారు దుండగులు. ప్రధాన నిందితుడు మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా ప్రత్యేక అప్ తో ఢిల్లీ నుంచి గంజాయి తరలింపును మానిటరింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. స్మగలర్లకు ఒక్కరికి రూ.20 వేల చొప్పున ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. అక్షరదాం, కశ్మీర్ గేట్ వరకు తరలించి అక్కడ వేరే వ్యక్తుల అప్పగిస్తారని డీఎస్పీ తెలిపారు.