కుండపోత వర్షం ఆగిపోయాక హైదరాబాద్‌లో లేటెస్ట్ ట్రాఫిక్ అప్డేట్ ఇది..

కుండపోత వర్షం ఆగిపోయాక హైదరాబాద్‌లో లేటెస్ట్ ట్రాఫిక్ అప్డేట్ ఇది..

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకం చూశారు. గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, రాయదుర్గం, హైటెక్‌ సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనాలు ముందుకు కదలడానికి గంటల కొద్దీ సమయం పట్టింది.

మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌ఏరియాల్లో వాహనదారులు ట్రాఫిక్ కారణంగా నానా తిప్పలు పడ్డారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, షేక్ పేట్ ఏరియాల్లో వాన దంచి కొట్టింది. బంజారాహిల్స్లో భారీ వర్షం కురవడంతో దేవరకొండ బస్తీలో సంతలో కూరగాయలు, వాహనాలు కొట్టుకుపోయాయి.

మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా కొండాపూర్, హైటెక్స్, కొత్తగూడ నుంచి కూకట్‌‌పల్లి, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్ కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. సైబర్​టవర్స్ నుంచి నీరూస్ జంక్షన్ వరకు నీళ్లు నిలిచిపోవడంతో ఈ రూట్‌లో వెళ్లే వెహికల్స్కు రోడ్డు బ్లాక్ అయింది. ఇనార్బిట్ మాల్​నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్​వైపు వెళ్లే వెహికల్స్‌‌తో ట్రాఫిక్​ జామ్ అయింది. ఐకియా, ఏఐజీ నుంచి వచ్చే వెహికల్స్​, గచ్చిబౌలి నుంచి కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్​పేట్ వైపు వెళ్లే వాటితో ఆ రూట్ ​మొత్తం ట్రాఫిక్​జామ్ అయింది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర అయితే ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం.